తెనాలి: అసత్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

9చూసినవారు
తెనాలి: అసత్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్య, అసత్య పోస్టులు పెడుతున్న బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్‌ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టీటీడీ చైర్మన్‌కు సంబంధించిన వ్యవహారంలో జెట్టి రేణుకపై షేక్ సయ్యద్ దుష్ప్రచారాలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేసి, రెండవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు షేక్ సయ్యద్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్