తెనాలి రెండో పట్టణ పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక బస్టాండ్ రోడ్డు, గంగానమ్మ పేటలో ఒంటరిగా నివాసముంటున్న ఇద్దరు వృద్ధ మహిళలను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించి నగదు వసూలు చేశాడు. ప్రభుత్వ పథకం ద్వారా తక్కువ ధరకే టీవీ, ఫ్రిజ్ వంటివి వస్తాయని చెప్పి, ఒకరి వద్ద రూ. 40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు వసూలు చేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.