తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రజక చెరువు సెంటర్ నుంచి ఐతానగర్ వైపు వెళ్లే మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయంగా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సీఐ రాములు నాయక్ వ్యాపారస్తులను ఆదేశించారు. రోడ్డు మీద వరకు ఉన్న హోర్డింగులు, ప్లెక్సీలను తొలగించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదని సీఐ హెచ్చరించారు.