యువతిని నమ్మించి అత్యాచారం చేసిన ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని మండలంలోని విద్యాలయంలో చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. అదే కళాశాలలో నందుతో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరూ హోటళ్లలో పలుమార్లు కలుసుకున్నారు. తర్వాత ఆమెను నారాకోడూరు, గుంటూరు ప్రాంతాల్లోని లాడ్జీలకు తీసుకెళ్లి బలవంతానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫోటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.