Feb 06, 2026, 14:02 IST/
పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం: మంత్రి సీతక్క
Feb 06, 2026, 14:02 IST
తెలంగాణ ప్రజలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో అమలు చేసిన 'కుటుంబశ్రీ' మోడల్‌ను అనుసరించి ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. కేరళలో సర్వే ద్వారా 65 వేల మంది అత్యంత పేదలను గుర్తించి.. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణలోనూ అదే తరహాలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామని వివరించారు.