ఉపాధి హామీ నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర అగస్టీన్

12చూసినవారు
ఉపాధి హామీ నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర అగస్టీన్
గురువారం వేమూరు మండలం వరహాపురం, కుచ్చేళ్లపాడు గ్రామాల్లోని ఉపాధి పని ప్రదేశాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి. అగస్టీన్ సందర్శించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అగస్టీన్ మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టాన్ని దశల వారీగా నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేస్ యాప్ వల్ల హాజరు నమోదు కాక చాలా మంది కార్మికులు పని కోల్పోతున్నారని, రెండు పూటలా హాజరు నమోదు ఇబ్బందికరంగా ఉందని కార్మికులు తెలిపారని, ఉపాధి పని కొలతలు పని ప్రాంతంలోనే వేయాలని, కానీ అలా జరగటం లేదని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్