బాపట్ల జిల్లా కొల్లూరులోని తాల్లపనేని జయలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని బావిరెడ్డి దివ్య తేజశ్రీ, పదవ తరగతి పరీక్షల్లో 600కు 596 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం సాధించిన దివ్య తేజశ్రీని పాఠశాల యాజమాన్యం అభినందించింది.