డీజిల్ కొరత బంకుల వద్ద వాహనదారుల అవస్థలు

1చూసినవారు
డీజిల్ కొరత బంకుల వద్ద వాహనదారుల అవస్థలు
ఆదివారం తెల్లవారుజామున కొల్లూరు మండలంలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం బంకుల్లో డీజిల్ స్టాక్ లేదని, ఇండియన్ ఆయిల్ బంకులో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. డీజిల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద క్యూలో నిలబడిన వాహనదారులు, స్టాక్ లేదని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కొరతను అధిగమించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్