బాపట్ల జిల్లా వేమూరులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేమూరు రైల్వే స్టేషన్ పరిధిలోని నిమ్మతోటల సమీపంలో ఓ వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వయసు సుమారు 65 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.