ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి ఎమ్మెల్యే

4చూసినవారు
మంగళవారం అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలోని బాప్టిస్ట్ చర్చి 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకు వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. చర్చి సమాజం చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించడంలో చర్చిల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఈ వేడుకలకు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you