అంతర్రాష్ట్ర మహిళా దొంగలు ఇంకొల్లు పోలీసులకు చిక్కారు

1569చూసినవారు
అంతర్రాష్ట్ర మహిళా దొంగలు ఇంకొల్లు పోలీసులకు చిక్కారు
మంగళవారం, ఇంకొల్లు పోలీసులు ఇద్దరు అంతర్ రాష్ట్ర మహిళా దొంగలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు ముందు హాజరుపరిచారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత, గండికోట పద్మలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులు, పర్సులు దొంగిలించేవారు. ఇటీవల ఇంకొల్లు, వంకాయలపాడు, అద్దంకి బస్టాండ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. వీరిపై తెలంగాణలో మూడు, ఆంధ్రలో 14 కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి 136 గ్రాముల బంగారం, 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందానికి ఎస్పీ నగదు రివార్డు అందించారు.

సంబంధిత పోస్ట్