వేమూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తెనాలిలో జరిగిన మహానాడు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.