సోమవారం రాత్రి గుంటూరులోని వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో భీమ్ అవార్డ్స్ – 2026 ప్రదానోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సమాజానికి సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించి భీమ్ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నక్కా ఆనంద బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.