వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆదివారం భట్టిప్రోలు గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా జరిగిన 11వ దివ్య రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థించారు.