మాజీ సీఎం నాదెండ్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

928చూసినవారు
మాజీ సీఎం నాదెండ్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు మరణం పట్ల వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే, నాదెళ్ల భాస్కర్ రావు ప్రజాసేవలో చిరస్మరణీయమైన సేవలు అందించిన గొప్ప నాయకుడని, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్