ప్రజలు పిజిఆర్ఎస్ సేవలు వినియోగించుకోండి ఎమ్మెల్యే

15చూసినవారు
కొల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే ఆనంద్‌బాబు సేకరించి, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడడం తమ బాధ్యత అని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతో పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్