వేమూరు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి పనులను వెంటనే పూర్తిచేసి ప్రారంభించాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమావేశంలో, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఆర్ అండ్ బి డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లతో చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన పనులను గుర్తించి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన తెలిపారు.