బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం హైదర్‌పేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, ముందున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐచర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.