తెలుగుదేశం పార్టీ అధినేత, వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు ఆదేశాల మేరకు, నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో మహానాడు–2026 కార్యక్రమాలను బుధవారం డిజిటల్/హైబ్రిడ్ విధానంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి క్లస్టర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకలను విజయవంతం చేశారు.