ఈనెల 9న ఏబీఎన్ ఛానెల్‌లో వైసీపీ నాయకులపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందన లేకపోవడంతో, బుధవారం బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లె, పర్చూరు వైయస్సార్ పార్టీ సమన్వయకర్తలు వరికూటి అశోక్ బాబు, పీట మోహన కృష్ణ, గాదె మధుసూదన రెడ్డి బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ కు ఫిర్యాదును పునః పరిశీలించి ఏబీఎన్ రాధాకృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.