వినుకొండలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో లోకక్షేమం, సకల జనుల శ్రేయస్సు కోసం 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం చేపట్టారు. శ్రీవారి తిరునామాల ఆకృతిలో కలశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం, వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.