వినుకొండ రూరల్ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గుండ్లకమ్మ వద్ద కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్ తీగ తగిలి నూజండ్ల మండలం ఐనవోలుకు చెందిన రైతుల 8 గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. సుమారు రూ. 10 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.