రేమిడిచర్ల శ్రీ గంగా–గౌరీ శంకర ఆలయ వార్షికోత్సవ వేడుకలు

9చూసినవారు
రేమిడిచర్ల శ్రీ గంగా–గౌరీ శంకర ఆలయ వార్షికోత్సవ వేడుకలు
బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో శ్రీ గంగా–గౌరీ శంకర ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మంగళవారం తెలిపింది. దాతల సహకారంతో ఏడాది క్రితం సుమారు రూ. 3 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించినట్లు కమిటీ చైర్మన్ కలవల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నసంతర్పణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్