బ్రాంచి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

4చూసినవారు
బ్రాంచి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వినుకొండలోని చైతన్యపురి కాలనీకి చెందిన షేక్ రఫీ (35) సోమవారం స్నేహితులతో కలిసి గంటావారిపాలెం సమీపంలోని బ్రాంచి కాలువలో ఈతకు వెళ్ళాడు. కాలువ మధ్యలోకి వెళ్లిన రఫీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం విఫలమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహం కాలువలో లభ్యమైంది. ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది.

ట్యాగ్స్ :