నూజెండ్ల మండలంలోని తలార్లపల్లి గ్రామ శివారులో బ్రిడ్జి కూలిపోవడంతో వినుకొండ–ఈదర–అద్దంకి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనతో ఆ మార్గంలో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.