సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపు

0చూసినవారు
సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపు
మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో, సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చిన్నమల్లయ్య దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్