వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

4949చూసినవారు
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారు ఊరేగింపులో భాగంగా మరో వర్గంపై దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.