హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

10చూసినవారు
వినుకొండ మండలం గోనుగుంట్లవారిపాలెంకు చెందిన రాజు (25) పట్టణ శివారులోని చెక్కవాగు వద్ద హత్యకు గురైన ఘటనపై మాల మహానాడు నాయకులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న రాజు మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్