పల్నాడు జిల్లా వినుకొండలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 1960 ప్రాంతంలో నిర్మించిన చారిత్రక NSP అతిథి గృహాన్ని శనివారం అర్ధరాత్రి కూల్చివేశారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటులో భాగంగా ఈ కూల్చివేత జరిగినట్లు సమాచారం. అయితే, దీనిపై NSP కాలనీ అధికారులు స్పందించలేదు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికుల్లో చర్చనీయాంశమైంది.