ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో పిచ్చమ్మ (70) అనే వృద్ధురాలు పొలంలో పంట అవశేషాలను కాల్చుతుండగా అగ్నిప్రమాదంలో చిక్కుకుని మృతి చెందింది. గాలికి మంటలు వ్యాపించడంతో ఆమె చీరకు అంటుకుని తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.