నకిలీ విత్తనాల మోసం.. ఈపూరు రైతుల ఆవేదన

4చూసినవారు
ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ రైతులు నకిలీ వరి విత్తనాలతో మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. వినుకొండలో 'అజిత' పేరుతో విక్రయించిన కొత్త రకం విత్తనాలను సుమారు 100 ఎకరాల్లో సాగు చేయగా, ఆశించిన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు తెలిపారు. ఎకరాకు కేవలం 15 బస్తాల దిగుబడి రావడంతో పెట్టుబడి కూడా రాలేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విక్రేత తప్పుడు హామీలతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్