నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం నుంచి కోమటినేనివారి పాలెం వెళ్లే దారిలో ఆదివారం కోడిపందాల స్థావరంపై నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. సమాచారం మేరకు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 బైక్ లు, రూ. 19, 400 నగదు, సెల్ ఫోన్లు, 4 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.