సిఐ చిన్న మల్లయ్యపై అత్యాచార ఆరోపణలు

5585చూసినవారు
వినుకొండలో మరో వివాదం రేగింది. సిఐ చిన్న మల్లయ్యపై ధనలక్ష్మి అనే మహిళ అత్యాచారం ఆరోపిస్తూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో వినుకొండలో పనిచేసిన సమయంలో పరిచయం ఏర్పడిందని, బ్రాహ్మణపల్లి వద్ద తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం అతడిని గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, కారంపూడిలో టీడీపీ నేతను గన్‌తో బెదిరించిన కేసులో ఇప్పటికే చిన్న మల్లయ్యను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.