వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి పేదల పాలిటి పెన్నిధి అని ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 67 మంది లబ్ధిదారులకు 38 లక్షల 94 వేల రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు.