వినుకొండ: వరిపంట పరిశీలించిన ఎమ్మెల్యే

9చూసినవారు
వినుకొండ: వరిపంట పరిశీలించిన ఎమ్మెల్యే
గురువారం, 'మొంథా' తుఫాన్ కారణంగా పంట నష్టపోయి తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పరామర్శించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన ఈపూరు మండలం, కొచ్చర్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించి, రైతులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే నేరుగా వరి పొలాల్లోకి వెళ్లి, మొంథా తుఫాన్ ధాటికి పూర్తిగా నేలకొరిగిన వరిపంటను పరిశీలించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎంతో శ్రమించి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పడుతున్న కష్టాలను, వారి ఆవేదనను దగ్గరుండి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్