వినుకొండ: ఆంజనేయస్వామి ఆలయంలో దొంగల బీభత్సం

16చూసినవారు
వినుకొండ: ఆంజనేయస్వామి ఆలయంలో దొంగల బీభత్సం
వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి స్వామివారి వెండి కిరీటం, వెండి గదను అపహరించుకుని పారిపోయారు. బుధవారం ఉదయం భక్తులు ఈ ఘటనను గమనించి గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్