యద్దనపూడి మండలం అడుసుమల్లి గ్రామంలో సోమవారం పొగాకు కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని ప్రారంభించారు. తొలుత ఆయన రైతులు తీసుకువచ్చిన పొగాకులో తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. మార్క్ఫెడ్ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని సూచించారు.