దక్షిణాది రాష్ట్రాలకు సమన్వయకర్తగా జీవీఎల్ నరసింహారావు

9235చూసినవారు
దక్షిణాది రాష్ట్రాలకు సమన్వయకర్తగా జీవీఎల్ నరసింహారావు
దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును దక్షిణాది రాష్ట్రాల బీజేపీ సమన్వయకర్తగా నియమించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బడ్జెట్‌పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు ఆయన సారథ్యం వహించనున్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం ఆయనకు నిర్దేశించింది.ఈ నియామకం బీజేపీ వ్యూహాత్మక అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్