అమెరికా హెచ్1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మార్చి 30 (సోమవారం) నుంచి వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించడంతో పాటు వాటిని పబ్లిక్ మోడ్‌లో ఉంచాలి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం, కాన్సులేట్ అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఇతర డిజిటల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ మార్పులు వీసా స్క్రీనింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేస్తాయి.