జుట్టు ఎక్కువగా రాలుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో అధిక జుట్టు రాలడానికి థైరాయిడ్, శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, PCOS, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వంటివి కారణం కావచ్చని వైద్యులు అంటున్నారు. నివారణకు సమతుల్య, పోషకమైన ఆహారం, ఐరన్, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్ర అవసరమంటున్నారు.