డైనోసార్ తోలుతో హ్యాండ్‌బ్యాగ్.. ప్రారంభ ధర రూ.4 కోట్లు !

4133చూసినవారు
డైనోసార్ తోలుతో హ్యాండ్‌బ్యాగ్.. ప్రారంభ ధర రూ.4 కోట్లు !
మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన టైరన్నోసారస్ రెక్స్ శిలాజాల నుంచి సేకరించిన కొల్లాజెన్‌ను, ఇతర జంతు కణాలతో కలిపి ల్యాబ్‌లో కృత్రిమంగా పెంచి, తోలుగా మార్చి హ్యాండ్‌బ్యాగ్‌ను రూపొందించారు. ఈ వినూత్న ప్రయోగం నెదర్లాండ్ శాస్త్రవేత్తలు, డిజైనర్ల బృందం చేసింది. మే 11న ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఆర్ట్ జూ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్న ఈ బ్యాగ్ ప్రారంభ ధర రూ. 4 కోట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే, డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలోనే ఉంటుందని, దానితో నిజమైన చర్మాన్ని పునఃసృష్టించడం సాధ్యం కాదని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్