హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

1370చూసినవారు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
AP: నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడుతూ, 'శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. రామ కార్యమే నా ధర్మం అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన. మనోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు చూపిన మార్గం మనకు ఆదర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్