వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయబడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్ 'హనుమాన్' ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనావాసాల్లోకి వన్యప్రాణుల రాకను నియంత్రించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.