ఏపీ డిప్యూటీ సీఎం,
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్.. రాజకీయ రంగంలోనూ ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారని కొనియాడారు. ప్రజా సేవలో ఆయన మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భగవంతుడు పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.