AP: అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి విశిష్ట సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా మారాలని పిలుపునిచ్చారు. కాగా, అమరావతిలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు నిజాయితీ, కృషి, దూరదృష్టి దేశానికి ఆదర్శమని బాబా రాందేవ్ కొనియాడారు.