AP: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బాధితురాలు హర్షవీణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అక్రమ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేశారని, ఆమె ఎదురుతిరగడంతో పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మహిళను వేధింపులకు, భయాందోళనకు గురిచేస్తున్నారని, కేసుల్లో వాస్తవం లేదని వాదించారు.