AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రాధాన్యం తగ్గుతోందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. ఇటీవల జరిగిన పార్టీ నేతల ఆత్మీయ సమావేశానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో స్థానం దక్కకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. రెండేళ్ల క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరినప్పటి నుంచే ఆయన ప్రయాణం సాఫీగా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ కావాలనే కొన్ని కార్యక్రమాలకు శ్రీనివాసరెడ్డిని దూరంగా పెడుతున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు
జనసేన నాయకులు ఆరోపిస్తున్నా
రు.