AP: ధర్మవరం నియోజకవర్గంలో తనపై వస్తున్న విమర్శలపై మంత్రి సత్య కుమార్ అప్రమత్తమయ్యారు. మంత్రి సత్య కుమార్ నియోజకవర్గానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, పీఏల జోక్యం పెరిగిపోయిందని స్థానికంగా, మిత్రపక్ష
టీడీపీ వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొంది. ఇటీవల జరిగిన ఒక దాడి ఘటనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. దాంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా.. ఆయన నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించనున్నారని సమాచారం.