AP: అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ వినిపించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.