ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కామినేని శ్రీనివాసరావు వర్సెస్ బాలకృష్ణ ఎపిసోడ్, చిరంజీవి ప్రస్తావన, బోండా ఉమా-పవన్ కళ్యాణ్ మధ్య తేడాలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి-నాదెండ్ల మనోహర్ మధ్య విభేదాలు వంటివి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. అయితే వైసీపీ సభ్యులు సభలో లేకపోయినా, ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మారాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారని టాక్.